instruction stringlengths 0 12.1k | input stringlengths 0 22.2k | output stringlengths 1 23.8k |
|---|---|---|
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి
సిలికాజెల్ సమక్షంలో తేమతో కూడిన గాలి, తడి లేకుండా మారుతుంది. దీనికి కారణం ఏమిటి? | సిలికాజెల్ సమక్షంలో తేమతో కూడిన గాలి, తడి లేకుండా మారుతుంది. దీనికి కారణం నీటి అణువులు జెల్ యొక్క ఉపరితలంపై అధిశోషణం చెందుతాయి. | |
“తీగచుట్టల అభివాహ మార్పు వ్యతిరేక దిశలో ప్రేరణ విద్యుత్ ప్రవాహం ఉంటుంది.” దీనినే …. అంటాం.
A) VSEPR సిద్ధాంతం
B) లెంజ్ నియమం
C) ఫారడే నియమం
D) ఓమ్ నియమం | B) లెంజ్ నియమం | |
హిమాలయ నదులు మూడు ముఖ్యమైన వ్యవస్థల కిందకు వస్తాయి.
I. సింధూ నదీ వ్యవస్థ II. గంగానదీ వ్యవస్థ III. ?
ప్ర. మూడవ వ్యవస్థ పేరు రాయండి. | బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ | |
ఒక వ్యాపార సంస్థకు అవసరమైన వివిధ రకాల మూలధనాన్ని పేర్కొనండి. | వ్యాపార సంస్థ ప్రారంభించడానికి విత్తము అవసరమవుతుంది. దీనినే మూలధనం అంటారు. మూలధనము ఎంత అవసరము అవుతుంది అనేది వ్యాపార సంస్థ యొక్క స్వభావము, పరిమాణాన్ని బట్టి ఉంటుంది. మూలధనమును రెండు రకాలుగా విభజించవచ్చును. అవి: 1. స్థిర మూలధనము 2. నిర్వహణ మూలధనము.
1) స్థిర మూలధనము: ఒక వ్యాపార సంస్థ స్థాపనకు ‘స్థలము, భవనాలు, యంత్రాలు, ప... | |
మొక్కలు నాటితే పర్యావరణానికి మేలు చేస్తాయి – ఇది ఏ రకమైన సంక్లిష్ట వాక్యం?
A) చేదర్థక వాక్యం
B) అష్యక వాక్యం
C) ప్రార్థనాద్యర్థక వాక్యం
D) సంయుక్త వాక్యం | A) చేదర్థక వాక్యం | |
ఇచ్చిన పదానికి నానార్ధాలు ఇవ్వండి: ఉక్తి | సరస్వతి, మాట | |
హరిశ్చంద్రుని గొప్పదనం గురించి మీ అభిప్రాయాలు చెప్పండి. | హరిశ్చంద్రుడు అయోధ్య రాజధానిగా పాలించిన సూర్యవంశ చక్రవర్తి. సూర్యవంశానికి గొప్ప పేరు ప్రతిష్ఠలు తెచ్చి పెట్టినవాడు. గొప్పదాత. వివేకమే సంపదగా కలవాడు. మంచి కీర్తి వైభవాలు కలవాడు. ధనుర్వేద విద్యలో ఆరితేరినవాడు. సముద్రమంత దయగలవాడు. సర్వశాస్త్రాలు తెలిసినవాడు. సత్యవాక్పరిపాలకుడు. ఆడినమాట తప్పనివాడు. వశిష్ఠుడు చెప్పినట్లు బ్... | |
క్రింది వానిలో కరణీయ సంఖ్య కానిది ఏది ?
(A) √2
(B) √3
(C) √4
(D) √5 | (C) √4 | |
కింది వాక్యాన్ని ఏ రీతి వాక్యం అని గుర్తించి రాయండి.
వారు వెళ్ళవచ్చా? | సందేహార్థక వాక్యం. | |
క్లోమ గ్రంథి విడుదల చేసే హార్మోన్
A) వ్యాసోప్రెస్సిన్
B) అడ్రినలిన్
C) ఇన్సులిన్
D) ప్రొజెస్టిరాన్ | C) ఇన్సులిన్ | |
ఇచ్చిన పదానికి పర్యాయ పదాలని ఇవ్వండి: పువ్వు | పుష్పము, ప్రసూనము, కుసుమము, విరి, సుమము | |
కుటుంబంలో ‘మన’ అనే భావన లేకపోతే ఎలా ఉంటుంది? | కుటుంబంలో ‘మన’ అనే భావన కుటుంబ సభ్యులందరికీ ఉండాలి. అప్పుడే అందరూ కలసిమెలసి, కుటుంబం అభివృద్ధికి పాటుపడతారు. అందరూ సంపాదిస్తారు. ఒకరి అవసరాలకు మరొకరు సాయపడతారు.
‘మన’ అనే భావన లేకపోతే సమష్టి కుటుంబం అనేది సక్రమంగా నడువదు. స్వార్థపరత్వం పెరుగుతుంది. పరస్పరం పోటీ, ద్వేషం, ఈర్ష్య, అసూయ, తగవులు వస్తాయి. అప్పుడు అందరూ కలసిమ... | |
భాషల మధ్య జరిగే ఆధానప్రదానాలను చర్చించండి? | ఒక భాషా పదాన్ని మరొక భాష స్వీకరించడం కొత్తేమీకాదు. పలు భాషలు మాట్లాడే ప్రజలు ఒక చోట కలిసి మెలసి ఉన్నప్పుడు భాషలలో ఆదాన ప్రదానాలు సహజంగా జరుగుతుంటాయి. ఒక భాషా పదాన్ని వేరొక భాష స్వీకరించేటప్పుడు ఏదో ఒక విభక్తి ప్రత్యయాన్ని చేర్చి ఆ భాషా పదాన్ని మరొక భాషాపదం స్వీకరిస్తుంది. ఒక్కొక్కసారి యథాతదంగాను లేదా ఒక అక్షరాన్ని చేర్... | |
సరీసృపాల విభాగంలో వర్తమాన క్రమాలను తెలపండి. ప్రతీ క్రమానికి రెండు ఉదాహరణలు ఇవ్వండి. | వర్తమాన సరీసృపాలను నాలుగు క్రమాలుగా ఏర్పరచారు :
1. కిలోనియా :
కిలోన్ (సముద్ర ఆకుపచ్చ తాబేలు), టెస్టుడో (భౌమ్య తాబేలు), ట్రియోనిక్స్ (మంచినీటి తాబేలు).
2. రింకోసెఫాలియా :
స్ఫీనోడాన్ (సజీవ శిలాజం-న్యూజిలాండ్కి పరిమితమై ఉంటుంది)
3. క్రొకోడీలియ :
క్రొకోడైలస్ పాలుస్ట్రీస్ (భారతదేశం మొసలి లేదా మగర్), అలిగేటర్, గేవియాలిస్, ... | |
సంగం యుగంలోని ప్రధాన అంశాలను వివరించండి. | సంగం యుగంలో ఈ క్రింది అంశాలు కలవు. అవి.
రాజకీయ వ్యవస్థ: నాడు నిరంకుశ రాజరికపు వ్యవస్థ అమల్లో వుంది. రాజుకు సర్వాధికారాలు ఉండేవి. సభ అనే ప్రజాసభ పరిపాలన, న్యాయ వ్యవహారాల్లో రాజుకు సలహాలను ఇచ్చేది. గ్రామపాలనను గ్రామ సంఘాలు నిర్వహించేవి. చతురంగ బలాలతో పాటు రాజు నౌకాదళాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. యుద్ధంలో పాల్గొనడం, యు... | |
దేహ సమఖండీభవనానికి సంబంధించిన స్వరూప లక్షణాల ఆధారంగా ఒక హైరుడినీయన్ ను ఇతర అనెలిడ్ నుంచి ఎలా గుర్తిస్తారు? శరీర కుహర అంశాలకు సంబంధించి జలగ శరీర కుహరం వానపాము శరీరకుహరం నుంచి ఏ రకంగా భిన్నమైంది? | దేహం పృష్టోదర తలాలలో అణచబడి, నిర్దిష్ట సంఖ్యలో ఖండితాలు కలిగి ఉంటుంది. ఖండితాలు బాహ్యంగా ఉపఖండితాలుగా విభజింపబడి ఉంటాయి.
జలగ శరీర కుహరము బొట్రాయిడల్ కణములతో నిండి ఉంటుంది. వానపాము శరీర కుహరం శరీర కుహర ద్రవముతో నింపబడి ఉండును.
| |
ప్రశ్న : నేడు మనం నిప్పును దేనికి ఉపయోగిస్తున్నాం?
| నేడు మనము నిప్పును క్రింది విధంగా ఉపయోగిస్తున్నాము.
ఆహారాన్ని వండుకుని తినుటకు
వెచ్చదనం పొందటానికి, నీటిని వేడి చేయటానికి.
మతానికి సంబంధించిన క్రతువులలో, కర్మకాండలలో
కొన్ని రకాల పంటల ప్రాసెసింగ్ లో (ఉదా : పొగాకును కాల్చుట)
వివిధ రకాల పరిశ్రమలలో (ఉదా : ఇనుము – ఉక్కు పరిశ్రమలో, సిమెంట్ పరిశ్రమలలో)
వెల్డింగ్ పనుల్లో
బొగ్... | |
ఊపిరితిత్తుల యొక్క ప్రత్యేకత ఏమిటి? | మన శరీర అవయవాలలో నీటిపైన తేలే ఒక అవయవం ఊపిరితిత్తులు. ఇవి బెలూన్ లాగా వ్యాకోచించే సామర్థ్యంతో 1200 మి.లీ వాయువును ఎప్పుడూ కలిగి ఉంటాయి. వీటి పూర్తి సామర్థ్యం 5900 మి.లీ. | |
కింది పరిచిత గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
తెల్లవారడం తడవుగా వెళ్ళి రాణేదారు పాదాల మీద వాలిపోయాడు ఖాను. ఇంతవరకూ అంత గొప్ప అత్తర్లు పెద్దాపురం కోటకు రాలేదన్న సంగతి రాణేదారుకి తెలుసు. ఖానుకి మంచి సన్మానం జరగడం దివాంజీకి సుతరామూ ఇష్టం లేదు. ఇది తెలుసు ఇతనికి. బుర్ర ఎగిరిపోడానికి కయినా ఒప్పుకుంటాడు గా... | 1. ఖాను ఎవరి పాదాల మీద వాలిపోయాడు?
జవాబు:
భాను ఠాణేదారు పాదాలమీద వాలిపోయాడు. ఉంది.
2. భానుకి సన్మానం జరగడం ఎవరికి ఇష్టం లేదు?
జవాబు:
భానుకి సన్మానం జరగడం దివాంజీకి సుతరామూ ఇష్టం లేదు.
3. అత్తరు చూశాడంటే విడిచిపెట్టనిది ఎవరు?
జవాబు:
అత్తరును చూశాడంటే విడిచిపెట్టనిది మహారాజు.
4. ఈ పేరా ఆధారంగా దివాంజీ ఎలాంటి స్వభావం గ... | |
వర్గీకరణ అంటే ఏమిటి? వర్గీకరణ ఆవశ్యకతను తెలియజేయండి. | ప్రపంచంలోని అన్ని సజీవుల గురించి అధ్యయనం చేయడం అసాధ్యం. కానీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి జీవులను వర్గీకరిస్తారు. జీవులను వాటి గుర్తింపు లక్షణాల ఆధారంగా అనుకూలమైన సమూహాలుగా విభజించే పద్ధతిని వర్గీకరణ అంటారు. ఈ అనుకూలమైన సమూహాలనే శాస్త్రీయ పరిభాషలో టాక్సా (ఏకవచనం : టాక్సాన్) అంటారు. టాక్సా వర్గీకరణలోని వివిధ స్థాయిల... | |
ప్రశ్న : యేసుక్రీస్తు ప్రధాన బోధనలు ఏవి?
| యేసుక్రీస్తు ప్రధాన బోధనలు :
మానవులందరూ దేవుని పిల్లలు.
పాపాలు చేయకుండా పవిత్రమైన జీవితాన్ని గడపండి.
నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువారిని కూడా ప్రేమించండి.
ఒక చెంపపై కొట్టినప్పుడు, మరొక చెంప చూపించు.
మానవసేవే మాధవసేవ.
శాంతి, ప్రేమ, కరుణ కల్గి ఉండాలి.
తనను తాను తగ్గించుకొనువాడు దేవునిచే హెచ్చింపబడును.
శత్రువు... | |
ఇచ్చిన పద్యానికి ప్రతిపదార్ధాలు మరియు భావం రాయండి
క. అలయించుచుఁ, దిన్నండు దన
కల లోపలఁగన్న శివునిఁ గనుఁగొనుదాఁకన్
జలమునఁ గొని చనెనయ్యే
కల మప్పు డదృశ్యమైనఁ గడుంజోద్యమునన్. | ప్రతిపదార్థం :
అలయించుచు = విసిగించుతూ
తిన్నడు = తిన్నడు అనువాడు
తన = తనయొక్క
కలలోపల = స్వప్నములో
కన్న = చూసిన / దర్శించిన
శివునిన్ = ఈశ్వరుని
కనుఁగొనుదాఁకన్ = చూసేవరకు
చలమునన్ = పట్టుదలతో
కొనిచనిన = తీసుకొని పోయిన
ఆ + ఏకలము = ఆ అడవి పంది
అప్పుడు = ఆ సమయంలో
కడున్ = మిక్కిలి
చోద్యమున్ = ఆశ్చర్యకరంగా
అదృశ్యము + ఐనన్ = మా... | |
సంగం యుగం నాటి సాహిత్యం గురించి సంక్లిప్తంగా వివరించండి | సంగం యుగంలో తమిళ సాహిత్య చరిత్ర ప్రారంభమైంది. ‘తోలకప్పియం’ అనే వ్యాకరణ గ్రంథాన్ని తోలకప్పియార్ రచించాడు. ‘కురల్’ అనే ప్రసిద్ధ కావ్యాన్ని తిరువళ్ళువార్ రచించాడు. నైతిక విలువలతో కూడిన ఈ కావ్యం తమిళుల జీవితాల్లో ప్రధానపాత్ర పోషించింది. జైన, బౌద్ధ కవులు, రచయితలు కూడా సంగం సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు. | |
px + q రేఖీయ బహుపది యొక్క శూన్య విలువను రాయండి. | px + q = 0 ⇒ px = – q ⇒ x = −q/p
∴ px + q యొక్క శూన్య విలువ −q/p | |
ఇచ్చిన పద్యానికి భావం రాయండి:
కం. రోషావేశము జనులకు
దోషము, తలపోయ విపుల దుఃఖకరము నౌ;
రోషము విడిచిన యెడ సం
చూస్తే యమధర్మరాజు నవ్వుతాడు.
తోషింతురు బుధులు హితము దోప కుమారా ! | ఓ కుమారా ! కోపం, ఉద్రేకం కలిగి ఉండడం చాలా తప్పు. ఆలోచించగా అవే బాధలను కలిగిస్తాయి. కోపం విడిచి పెడితే పండితులు సంతోషిస్తారు. మంచి జరుగుతుంది. | |
‘సీత సంగీతం, నృత్యం నేర్చుకుంటున్నది’ – ఇది ఏ రకమైన వాక్యం?
A) సామాన్య వాక్యం
B) సంయుక్త వాక్యం
C) సంక్లిష్ట వాక్యం
D) మహావాక్యం | B) సంయుక్త వాక్యం | |
‘చల్లని తల్లి చక్కని చెల్లి’ అని శాంతిని ఉద్దేశిస్తూ ‘ప్రకటన’ కవితను రచించిన కవిని గురించి రాయండి. | దేవరకొండ బాలగంగాధర తిలక్ ప్రకటన కవితను రాశాడు. ఈ కవిత ఆయన రచించిన ‘అమృతం కురిసిన
రాత్రి’ అనే కవితా సంకలనంలోది. తిలక్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా మండపాక గ్రామంలో – 1921లో జన్మించాడు. ఈయన అమృతం కురిసిన రాత్రి, గోరువంకలు, తిలక్ కథలు రచించాడు. 1971లో ఈయన అమృతం కురిసిన రాత్రి అనే కవిత సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ... | |
ప్రశ్న
రవాణా మరియు వాణిజ్యాల మధ్య సంబంధం ఉందని మీరు భావిస్తున్నారా? నీ సమాధానాన్ని సమర్థింపుము.
| రవాణా మరియు వాణిజ్యాల మధ్య సంబంధం ఖచ్చితంగా ఉందని నేను భావిస్తున్నాను.
వ్యాపారులకు, చేతి వృత్తుల వారికి రవాణా మార్గాలు చాలా ముఖ్యమైనవి. ఈ రవాణా మార్గాలు పెద్ద పట్టణాలను, ఓడరేవులను మరియు ఇతర దేశాలను కలుపుతాయి.
అభివృద్ధి చెందిన రవాణా మార్గాల వల్లనే (విదేశీ) వాణిజ్యం అభివృద్ధి చెందుతుంది.
రవాణా సౌకర్యాలు ఎంత ఎక్కువగా అంద... | |
యార్లగడ్డ బాలగంగాధరరావు గురించిన విశేషాలేమిటి ? | ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు గారు కృష్ణా జిల్లా దివిసీమకు సమీపంలో ఉన్న చల్లపల్లి ఎస్టేటులోని పెదప్రోలు గ్రామంలో 1.7.1940వ తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులు కృష్ణవేణమ్మ, భూషయ్య.
వీరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశారు. నామ విజ్ఞానంపై ప్రత్యేక అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన జాతీయ అంతర్జాతీయ ... | |
రేఖీయ సమీకరణాల జత-I సాధన-II
i) 7x + y = 10 5x – y = 2 అయిన a) x= 0, y = 0
ii) 5x – y = 0 7x + y = 0 అయిన b) సాధన లేదు
iii) x + y = 5, 2x + 2y = 10, అయిన c) x = 1, y = 3
iv) x + y = 5 x – y = 1, అయిన d) x = 3, y = 2
అయిన జతపరచడంలో సరైన దానిని ఎన్నుకొనుము.
A) i – c, ii – b, iii – a, iv-d
B) i- c, ii-b, iii – d, iv – a
C)... | C) i-b, ii – c, iii – a, iv-d | |
ముడి ధాతువుతో కలిసి ఉన్న మలినాలను అంటాం.
A) గాంగ్
B) ద్రవరారి
C) లోహమలం
D) ఖనిజం | A) గాంగ్ | |
పూర్తి అవ్యాకోచ డిమాండ్ గురించి సంక్లిప్తంగా వివరించండి | ధరలో ఎంత మార్పు వచ్చినా డిమాండ్లో ఏ మాత్రము మార్పు ఉండదు. దీనినే పూర్తి అవ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ రేఖ Y- అక్షానికి సమాంతరంగా ఉంటుంది. దీని సంఖ్యాత్మక విలువ Ep = 0 | |
క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి వెలసిన ముఖ్య వృత్తులు ఏవి? | 6వ శతాబ్దం నాటికి దాదాపు అరవై నాలుగు రకాల వృత్తులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వృత్తులను రెండు రకాలుగా భావించారు. అవి కొన్ని ఉన్నత స్థాయి, కొన్ని క్రింది స్థాయి వృత్తులుగా భావించారు. వడ్రంగులు దంతపు వస్తువుల తయారీదార్లు, నేత పనివారు, కంసాలి మొదలైనవి ఉన్నత వృత్తులుగా భావించబడ్డాయి. వేటగాళ్ళు, చేపలు పట్టేవారు, కటిక వృత... | |
ఆంధ్రరాష్ట్ర అవతరణలో పొట్టి శ్రీరాములు త్యాగం గురించి సొంత మాటల్లో రాయండి. | ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ప్రకటించే వరకు తన దీక్ష ఆమరణాంతం కొనసాగిస్తానని 19. 10. 1952న పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించారు. 15. 12. 1952 వరకు ఆమరణ దీక్ష కొనసాగించారు. ఆ రోజు రాత్రి 11.30 కి ఆయన హృదయ స్పందన ఆగిపోయింది. మూడు రోజుల పాటు ఆంధ్ర అగ్నిగుండమయింది. ఆంధ్ర ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆంధ్రర... | |
ఇచ్చిన గద్యానికి కొనసాగింపుగా ఒక పేరా రాయండి:
తెల్లవారుతుండగా పోలీసులు గ్రామంలోకి ప్రతి ఇల్లును సోదాచేస్తున్నారు. గొల్ల రామవ్వ ఇంటికి కూడా వచ్చారు. ఆమె భయపడిపోయింది. కాంగ్రెస్ వాలంటీర్ అయిన ఆ యువకుని ఎలాగైనా రక్షించాలనుకుంది. తన మనవరాలిని గొంగళితో ఆయువకుని కప్పి ఉంచమన్నది. వారిద్దరిని ఒకే మంచంపై పడుకోమని ఆజ్ఞాపించింది.... | పోలీసులు వెళ్ళిపోయారు. రామవ్వ మంచం మీద కూర్చొంది. ఒక వైపు యువకుడు, మరోవైపు ఆమె మనవరాలు వారిది అపూర్వ సమ్మేళనం అన్పించింది ఆ యువకునికి “అవ్వా! నీవు సామాన్యురాలివి కావు. ‘సాక్షాత్ భరతమాతవే’ అన్నాడు. ఇలా ఒక విప్లవ కారుని సామాన్య వృద్ధురాలు రక్షించిన కథే గొల్ల రామవ్వ కథ. | |
విశ్వసమితికి గుర్తును రాయండి. | µ | |
నమోదు అంటే ఏమిటి ? నమోదు ఖాతాలను వివరించండి. | చిట్టాలోగాని, సహాయక చిట్టాలో గాని నమోదు చేసిన పద్దులు ఆవర్జాలో సంబంధిత ఖాతాను ప్రారంభించి అందులో వ్రాయడాన్ని ‘ఆవర్జాలో నమోదు చేయడం’ అంటారు. చిట్టాలలో రాసిన పద్దులన్నింటిని ఆవర్జాలో వాటికి సంబంధించిన ఖాతాలలో నమోదు చేయడం వలన, ఒక నిర్ణీత కాలానికి సంబంధించిన ఖాతాల నికర మొత్తాలను తెలుసుకోవడానికి వీలవుతుంది.
నమోదుకు సంబంధిం... | |
ఇచ్చిన సంధి గురించి రాయండి మరియు ఉదాహరణలు కూడా రాయండి: యణాదేశ సంధి | ఇ, ఉ, ఋలకు వాని అసవర్ణాచ్చులు పరమైనపుడు క్రమంగా య, వ, రలు ఆదేశమగును.
అత్యంత = అతి + అంత = యణాదేశ సంధి
ధుర్యాత్మ = ధురి + ఆత్మ = యణాదేశ సంధి | |
పంపిణీ భావనలను వివరించండి. | అర్థశాస్త్రంలో పంపిణీ భావనను రెండు అర్థాలలో ఉపయోగించడం జరుగుతుంది. అంటే జాతీయాదాయ పంపిణీని రెండు విధాలుగా పరిశీలించవచ్చు.
విధులననుసరించి పంపిణీ.
వైయక్తిక పంపిణీ
1) విధులననుసరించి పంపిణీ: ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనలు సేవలందించినందుకు గాను, అవి ప్రతిఫలాలుగా భాటకం, వేతన... | |
సూర్యుని ఊర్ధ్వకోణం 0° నుండి 90° పెరుగుతూ ఉంటే, స్థంభము యొక్క నీడ పొడవు _________
A) మార్పులేదు
B) పెరుగుతుంది
C) తగ్గుతుంది
D) చెప్పలేము | C) తగ్గుతుంది | |
ఆర్థిక భాటకం గురించి సంక్లిప్తంగా వివరించండి | ఆర్థిక భాటకం కేవలం భూమికే పరిమితం కాకుండా మిగతా మూడు ఉత్పత్తి కారకాలైన శ్రమ, మూలధనం, వ్యవస్థాపనకు వర్తిస్తుంది. ఇది మూడు రకాలు
కొరత భాటకం
కృత్రిమ భాటకం
బదిలీ సంపాదన | |
ఏకవలయ రక్తప్రసరణ వ్యవస్థ కల జీవి
A) కప్ప
B) నత్త
C) కోడి
D) చేప | D) చేప | |
బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక అంటే ఏమిటి? | నగదు పుస్తకము, పాస్బుక్ నిల్వలను సమన్వయము చేయడానికి తయారుచేసే నివేదికను బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక అంటారు. నగదు పుస్తకము, పాస్బుక్ వేర్వేరు నిల్వలను చూపుతున్నప్పుడు, తేడాలు చూపడానికి గల కారణాలు కనుక్కొని, వాటని సమన్వయము చేయడానికి తయారుచేసే పట్టికను బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక అంటారు. ఈ పట్టికను నిర్దిష్ట కాలానికి అన... | |
ఇచ్చిన పద్యానికి ప్రతిపదార్ధాలు మరియు తాత్పర్యం రాయండి:
కాపాడుదురుమిమ్ము కనిపెట్టియుండి
పరరాజులను గెల్వ పైకొనిపోయి
అమితమ్ముగాగ ధనాదులనెల్ల
కొనవచ్చు ధర్మముల్ కూర్పంగవచ్చు
సత్మీర్తి జగముల సాంద్రమైనిల్చు
కలహించి వెనుకటి కౌరవులెల్ల
గతిచెడి పడినట్టి కష్టముల్ వినమె
పగ పెరిగించుట భావ్యంబుగాదు
ఉభయవాదులు మీరలొక్కటి కనుక
నయమొప్ప... | ప్రతిపదార్థం :
మిమ్ము = మిమ్మల్ని
కనిపెట్టి + ఉండి = కనిపెట్టుకొని యుండి
కాపాడుదురు = కాపాడతారు
పరరాజులను = శత్రురాజులను
గెల్వన్ = జయించటానికి
పైకొనిపోయి = దండెత్తి వెళ్ళి
అమితమ్ముగాక = అమితంగా
ధన + ఆదులన్ + ఎల్ల = సంపదలెన్నింటినో
కొనవచ్చు. = పొందవచ్చు
ధర్మముల్ = ధర్మపాలనను
కూర్పంగవచ్చు = సాగించవచ్చు
సత్కీర్తి = గొప్పక... | |
ఒక పౌనఃపున్య విభాజనం యొక్క తరగతులు 1 -9, 10 – 18, 19 – 27, ….. అయిన తరగతి పొడవు (l) ను కనుగొనుము. | తరగతి అంతరం (l) = 9 | |
e – వ్యాపారం వల్ల సంస్థలకు కలిగే ప్రయోజనాలు ఏవి ? | e – వ్యాపారం వల్ల వ్యాపార సంస్థలకు కలిగే ప్రయోజనాలు :
e – వ్యాపారము వలన సంస్థలు తమ ప్రస్తుత మార్కెట్ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు విస్తరింపచేసుకోవచ్చు. ఇది సంస్థ యొక్క అమ్మకాలను పెంచుతుంది.
e– వ్యాపారము వలన వస్తువులను లేదా సేవలను సృష్టించడము, ప్రాసెసింగ్ చేయడం, పంపిణీ చేయడం, స్టోరింగ్ చేయడం, సమాచారాన్ని సేకరించడానికి... | |
క్రింద ఇచ్చిన సినిమా పాటలోని ఒక భాగం యొక్క సాహిత్యంపై విశ్లేషణ చెయ్యండి:
సర సస్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం | సరస = మంచి రసము గల; స్వర = సంగీతము; సుర = దేవతల; ఝరీ = నది లేదా ప్రవాహం; గమనం = తలపు లేదా ప్రయాణం; విరించి = బ్రహ్మ; విరచించు = విశేషముగా రచించు; కవనం = కవిత్వం; విపంచి = వీణ. మంచి భావము గల సంగీతమును కలిగిస్తున్న గంగా నదిని తలపిస్తున్న సామవేదం యొక్క సారంశం, నేను పాడిన ఈ గీతం. ఇది జీవితానికి సంబంధించిన గీతం. బ్రహ్... | |
ఇచ్చిన గద్యానికి కొనసాగింపుగా ఒక పేరా రాయండి:
గోలకొండ కోటలో విశాలమైన, అందమైన రాజోద్యాన వనాలు, పుర ఉద్యానవనాలు ఉండేవి. అవి ఇంద్రలోకంలోని నందనవనాన్ని గుర్తు చేసే విధంగా ఉండేవి. సాయంకాల సమయములో కవులు, పండితులు ఆ పురోద్యానవనాలలో గుంపులు గుంపులుగా కూర్చుండి సారస్వత చర్చలు, కవితా గోష్ఠులు చేసేవారు. నగీనాబాఘ్ అనే ఉద్యానవనం చా... | కోటలో ఉన్న భవనాలు : కోటలో అంతఃపురాలు, సభాభవనాలు, కార్యాలయాలు, జలాశయాలు, క్రీడామైదానాలు మాత్రమే గాక సైనిక సమూహాలు నివసించే ఇండ్లు, అధికారుల నివాసస్థానాలు, పారిశ్రామికుల ఇండ్లు, పండిత, పామర నాగరికుల ఇండ్లు ఉన్నాయి. వాళ్ళకు మరుగుదొడ్లు, మురుగు నీరుపారే వసతులు, స్నానపు గదులు, వాటికి వేడి, చల్లనీటి ఏర్పాట్లు మొదలైన సామాజిక ... | |
‘చాలాసేపు నీవు టి.వి. చూడవద్దు’ – ఇది ఏ రకమైన వాక్యం?
A) నిషేధార్ధక వాక్యం
B) విధ్యర్థక వాక్యం
C) ప్రశ్నార్థక వాక్యం
D) ఆత్మార్థకం | A) నిషేధార్ధక వాక్యం | |
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి
వినిమయ బిల్లు, ప్రామిసరీ నోట్ల మధ్య వ్యత్యాసములు తెలపండి. | వినిమయ బిల్లుకు, ప్రామిసరీ నోటుకు క్రింది తేడాలున్నవి.
వినిమయ బిల్లు
1. బిల్లును ఋణదాత తయారుచేస్తాడు.
2. బిల్లులో బేషరతులతో కూడిన ఉత్తర్వు ఉంటుంది.
3. బిల్లులో బిల్లుకర్త, బిల్లు స్వీకర్త, బిల్లు గ్రహీత అనే మూడు పార్టీలుంటాయి.
4. బిల్లుకు బిల్లు స్వీకర్త స్వీకృతి అవసరం.
5. బిల్లు కర్త మరియు బిల్లు గ్రహీత ఒకరే కావచ్చు... | |
అంకణా తయారుచేసే పద్ధతులను వివరించండి. | అంకణాను రెండు పద్ధతులలో తయారుచేస్తారు. 1. మొత్తాల పద్ధతి 2. నిల్వల పద్ధతి.
1) మొత్తాల పద్ధతి : ఆవర్జాలోని ప్రతి ఖాతా డెబిట్, క్రెడిట్ వరుసలు విడివిడిగా కూడి అంకణాను తయారుచేసే పద్ధతిని మొత్తాల పద్ధతి అంటారు. ఈ పద్ధతి ప్రకారము ఆవర్జా ఖాతాలోని డెబిట్ మొత్తాన్ని, క్రెడిట్ మొత్తాన్ని కూడాలి. అయితే ఈ పద్ధతి ప్రస్తుతము వాడుకల... | |
‘శాంతి’ ఆవశ్యకతను తెలియజేస్తూ ఒక కరపత్రం రాయండి. | ప్రపంచశాంతి
మిత్రులారా ! ఈ విషయాన్ని గూర్చి ఒక్కసారి ఆలోచించండి. చిన్న చిన్న విషయాలకోసం దెబ్బలాటలకు దిగి, తలలు బద్దలుకొట్టుకోకండి. న్యాయస్థానాలకు వెళ్ళి డబ్బు తగులబెట్టకండి. మనది గాంధీ, బుద్ధుడు, జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన దేశం. ఎందరో మహర్షులు, ప్రవక్తలు పుట్టిన దేశం. వారి శాంతి బోధలు తలకు ఎక్కించుకోండి.
ప్రపంచంలో ఇప్... | |
క్రింది వానిలో పరిమిత సమితి.
A) {x : x ∈ N మరియు (x – 1) (x – 2) = 0}
B) {x: n ∈ N మరియు x = 2n + 1}
C) {x : x ∈ Z మరియు x^2 ≥ 24}
D) {x : x ∈ Z మరియు x <4} | A) {x : x ∈ N మరియు (x – 1) (x – 2) = 0} | |
ఏకస్వామ్య పోటీ గురించి సంక్లిప్తంగా వివరించండి | ఈ మార్కెట్లో వస్తు వైవిధ్యం ఉంటుంది. అనగా అనేక సంస్థలు కొంత భేదంతో ఒకే రకమైన వస్తువులను ఉత్పత్తి చేస్తాయి. అవన్నీ సన్నిహిత ప్రత్యామ్నాయాలు.
ఉదా: బూస్ట్, బోర్నవిటా మొదలగునవి. | |
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి
‘రూపాంతరం’ను నిర్వచించండి. మర్రి వృక్షం, మాంగ్రూప్ మొక్కలలో వేరు ఏ విధంగా రూపాంతరం చెందిందో తెలపండి. | 1. రూపాంతరం: కొన్ని ప్రత్యేక విధులను నిర్వర్తించడానికిగాను మొక్కల అంగాలలో ఏర్పడే నిర్మాణాత్మకమైన శాశ్వత మార్పుని రూపాంతరం అంటారు.
2. మర్రి వృక్షంలో వేర్లు పెద్దశాఖల నుండి ఊడవేర్లుగా రూపాంతరం చెందుతాయి. ఇవి నేలలోనికి పెరిగి స్థంభాలవలె పెరిగి వృక్షానికి అదనపు ఆధారాన్ని ఇస్తాయి.
3. మాంగ్రూవ్ మొక్కలలో వేర్లు శ్వాసమూలాలుగా ... | |
కింది పదాలను విడదీసి రాయండి.
ఉదా : అప్పుడప్పుడు = అప్పుడు + అప్పుడు
1. అక్కడక్కడ
2. ఏమేమి
3. చిట్టచివర
4. నట్టనడుమ
5. పట్టపగలు | 1. అక్కడక్కడ = అక్కడ + అక్కడ
2. ఏమేమి = ఏమి + ఏమి
3. చిట్టచివర = చివర + చివర
4. నట్టనడుమ = నడుమ + నడుమ
5. పట్టపగలు = పగలు + పగలు | |
రంగాపురం గ్రామంలో రాధ 10వ తరగతి చదువుతున్నది. ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఆ గ్రామంలోని ‘బాలల హక్కుల వేదిక’ సభ్యులు వెళ్ళి బాల్యవివాహం జరపడం వల్ల నష్టాలను ‘రాధ’ తల్లిదండ్రులకు వివరించారు. బాల్య వివాహాన్ని ఆపారు. రాధ తన చదువును తిరిగి కొనసాగించింది. రాధ వివాహం ఆపిన ‘బాలల హక్కుల వేదిక’ను అభినందిస్తూ ఒక లేఖ రాయండి. | లేఖ
అనంతపురం,
x x x x x x x x
‘బాలల హక్కుల వేదిక’ వారికి,
రామాపురం,
బంటుమిల్లి మండలం,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్.
మిత్రులారా,
మీరు సాధించిన ఘనవిజయాన్ని గూర్చి పత్రికలో చదివాము. మీ వేదిక సభ్యులు ‘రాధ’ అనే 10వ తరగతి చదివే 15 సంవత్సరాల అమ్మాయికి నిశ్చయమైన బాల్యవివాహాన్ని ఆపుచేయించారని తెలిసింది. బాల్యవివాహం వల్ల రాధ జీ... | |
తెలుగు వ్యావహారిక భాషలో తరచు వాడే కింద ఇచ్చిన జాతీయం గురించి వివరించండి:
ఉలుకు పలుకూ లేకపోవడం | ‘ఉలుకు’ అంటే భయం ‘పలుకు’ అంటే మాట ఎవరైనా ఎక్కడైనా భయంకరమైన జంతువును చూచినప్పుడుగాని, భయంకరాకృతిని చూచిన సందర్భంలోను నిశ్చేష్ఠులై పడి ఉండటాన్ని ఈ పదం తెలియజేస్తుంది. నిష్క్రియత్వం లేకపోవడమే ఉలుకు పలుకూ లేకపోవడం. | |
కింది పేరాలోని సామెతలను గుర్తించి రాయండి.
“అప్పుచేసి పప్పుకూడు తినకుండా, కోటి విద్యలు కూటి కొరకే కాబట్టి, ఏదో ఒక విద్యను నేర్చుకొని, తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం మాని, మూడు పువ్వులు ఆరు కాయలుగా జీవితంలో వృద్ధి చెందాలి”. | పై పేరాలోని సామెతలు ఇవి :
1) అప్పుచేసి పప్పుకూడు
2) కోటి విద్యలు కూటి కొరకే
3) తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం
4) మూడు పువ్వులు ఆరుకాయలు | |
ఇచ్చిన పదానికి నానార్ధాలు ఇవ్వండి: సూత్రం | నూలుపోగు, జంధ్యం, ఏర్పాటు | |
ప్రశ్న : సముద్రగుప్తుడు గొప్ప విజేత అని నీవు భావిస్తున్నావా? సమాధానాన్ని సమర్ధింపుము.
| సముద్రగుప్తుడు గొప్ప విజేత అని నేను భావిస్తున్నాను.
మొదటి చంద్ర గుప్తుని తర్వాత సముద్రగుప్తుడు రాజైనాడు.
ఇతని కాలంలో సామ్రాజ్యము ఉత్తర భారతదేశం అంతటా విస్తరించినది. సముద్రగుప్తుడు అపజయమే ఎరుగనటువంటి గొప్ప విజేత.
ఇతని తర్వాత రెండవ చంద్రగుప్తుడు పరిపాలకుడయ్యాడు. పశ్చిమ భారతదేశంలోని శకరాజులను కూడా ఇతను జయించగలిగినాడు.
సమ... | |
ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
మీ పరిసరాలలో ఉన్న ఒకే రకమైన ఆహారపు అలవాట్లు గల జంతువులను పేర్కొనండి.
| ఆవు, గేదె, మేక మరియు గొర్రెలు ఒకే రకమైన ఆహారపు అలవాటును కలిగి ఉంటాయి. ఎందుకంటే ఇవి శాకాహారులు. ఆహారం కోసం మొక్కల పై ఆధారపడతాయి. | |
కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
రాముడు అడవికి వెళ్ళెను. రాముడు తండ్రి మాట నెరవేర్చెను. | రాముడు అడవికి వెళ్ళి, తండ్రి మాట నెరవేర్చెను. | |
ఆంజనేయ స్తొత్రం రాయండి | నమో వాయుపుత్రాయ భీమరూపాయధీమతే
నమస్తే రామదూతాయ కామరూపాయశ్రీమతే
మోహశోక వినాశాయ సీతాశోక వినాశినే
భగ్నాశోక వనాయాస్తు దగ్ధలంకాయ వాగ్మినే
గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణదాయచ
వనౌకసాం వరిష్ఠాయ వశినే వననాసినే
తత్త్వజ్ఞాన సుధాసింధు నిమగ్నాయ మహీయసే
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ
జన్మమృత్యు భయఘ్నాయ సర్వక్లేశ హరాయచ
నేదిష్ఠ... | |
క్రింది ప్రశ్నకి ఒక్కమాటలో జవాబునివ్వండి.
హిమాలయాలకు తూర్పు వైపున సరిహద్దుగా ఉన్న లోయ ఏది? | బ్రహ్మపుత్ర లోయ. | |
ఇచ్చిన పద్యానికి భావం రాయండి:
మ|| నునుపుల్ దీర్చి మదంబు చిందిపడ నేన్గున్ గున్నలన్ జెక్కి వై
చిన చాతుర్యము నీ శిరోగ్రమున నిల్చెన్సత్కిరీటాకృతిన్;
తెనుగుందేశము నిన్నువంటి పనివానిం జూచి యుప్పొంగుచుం
డును; నీ లేమి దలంచి కంటఁ దడిబెట్టున్; శిల్పవిద్యానిధీ ! | భావం :
శిల్ప విద్యలో నిధివంటివాడా ! రాతిని నునుపు చేసి మదం చిందేటట్లుగా ఏనుగునూ, దాని పిల్లలనూ చెక్కిన నీ నేర్పు, నీ తలపై మంచి కిరీటం వలె నిలిచింది. తెలుగునేల నీ వంటి పనివాళ్ళను చూసి ఉప్పొంగిపోతూ ఉంటుంది. నీ దారిద్య్రాన్ని చూచి కన్నీరు కారుస్తుంది. | |
ప్రస్తుత శాస్త్ర విజ్ఞానం ప్రకారం కడుపులో అల్సర్ లకు కారణం ………….. గా కనుగొన్నారు.
ఎ) వ్యాకులత
బి) ఆహారపు అలవాట్లు
సి) బాక్టీరియా
డి) నులి పురుగులు
| సి) బాక్టీరియా | |
కంపెనీ స్థాపనా విధానాన్ని కూలంకషంగా విపులీకరించండి. | కంపెనీ స్థాపనలో నాలుగు దశలుంటాయి. అవి. 1) వ్యవస్థాపన 2) నమోదు లేదా రిజిస్ట్రేషన్ 3) మూలధన సమీకరణ 4) వ్యాపార ప్రారంభము.
1) వ్యవస్థాపన : కంపెనీ ఏర్పాటుకు ముందు జరిగే కార్యక్రమాన్ని వ్యవస్థాపన అంటారు. అనగా వ్యాపార ఉద్దేశ్యాన్ని ఏర్పరచుకొని, అవకాశాలను కనుగొని లాభార్జన కోసము ఉత్పత్తి సాధనాలను సమీకరించుకొని సమర్ధవంతముగా నిర్... | |
ప్రశ్న : వాళ్ళు పన్నులు చెల్లించటానికి ఎందుకు అంగీకరించి ఉంటారు? కొత్త ఏర్పాట్ల వల్ల వాళ్ళు ఏరకంగా ప్రయోజనం పొందారు?
| తమ జీవితాల రక్షణ కోసం, నీటిపారుదల సౌకర్యాల కోసం, తెగ వృద్ధి కోసం పన్నులు చెల్లించడానికి అంగీకరించి ఉంటారు. కొత్త ఏర్పాట్ల వల్ల వాళ్ళు తమ దృష్టిని పూర్తిగా తమ వ్యవసాయంపైన, వ్యాపారం పైనా పెట్టి ఉంటారు. తద్వారా వారు మంచి ఆదాయం పొంది ఉంటారు. | |
బదిలీ చెల్లింపులు గురించి సంక్లిప్తంగా వివరించండి | కొందరు వ్యక్తులు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకపోయినా ఆదాయంలో కొంత భాగాన్ని చెల్లించవలసి ఉంటుంది. అవి పెన్షన్లు, నిరుద్యోగభృతి, ప్రభుత్వ బాండ్లపై వడ్డీ మొదలగునవి. వీటిని బదిలీ చెల్లింపులు అంటారు. | |
అంతర్గత విత్త మూలాధారాలు గురించి సంక్లిప్తంగా వివరించండి | అంతర్గత మూలాలు అంటే సంస్థలోనే లభ్యమయ్యే వనరులు. అవి:
లాభాల పునరాకర్షణ
నిలిపి ఉంచిన ఆర్జనలు
వసూలు బిల్లులపై వసూళ్ళు
మిగిలిన సరుకు అమ్మకాలు
నిధులను వెనక్కి మళ్ళించడం లేదా నిధుల తగ్గింపు. | |
“కోపమంత చేదు ఫలము లేదు” వివరించండి ? | కోపంతో మానవులు మానవత్వాన్ని కోల్పోతారు. కోపం మానవులను నష్టపరుస్తుంది. కోపం వల్ల పాపం పెరుగుతుంది. కోపం వల్ల నిందలు వస్తాయి. కోపం ఎలా పోతుందో ఎవరికీ తెలియదు. కోపం స్నేహితులను తగ్గిస్తుంది అవమానపరుస్తుంది. కోపంతో శాపాలు వస్తాయి. చూస్తుండగానే కొరివిగా మారి మానవులను నాశనం చేస్తుంది. కాబట్టి కోపానికి దూరం ఉండాలని భావం. | |
“అమ్మ ప్రేమ ఉత్తమమైనది”. దీనిని సమర్థిస్తూ చర్చించండి. | (చర్చలో లత, రవి, కిరణ్, రాణి పాల్గొంటున్నారు)
లత : మా అమ్మ నాకెంతో ప్రేమగా చదువు చెబుతుంది.
రవి : మా అమ్మ చదువూ చెబుతుంది, భక్తిని, సంస్కారాన్ని నేర్పుతుంది.
కిరణ్ : మా అమ్మ కూడా అంతే, కాబట్టి మా అమ్మ ఒడి నాకు బడి, గుడి.
రాణి : నేను మాట్లాడే మాటలన్నీ మా అమ్మ నేర్పినవే.
లత : ఎంతో ప్రేమగా నాకు మంచి ఆలోచనలు మా అమ్మే నేర్ప... | |
ఫెరిటిమాలోని శుక్రగ్రాహికలు అంటే ఏమిటి? అవి ఏ ఖండితాలలో ఉంటాయి? | ఫెరిటిమాలో 6, 7, 8, 9 ఖండితాలలో పూర్వ విభాజకమునకు అంటుకొని ఖండితానికి ఒక జత చొప్పున శుక్రగ్రాహికలు అనబడే నిర్మాణాలుంటాయి. ఇవి సంపర్క సమయంలో శుక్ర కణాలను (శుక్ర గుళికలు) గ్రహించి నిల్వ చేస్తాయి. | |
నీటిని విచక్షణాయుతంగా వాడవలసిన అవసరం ఏమిటి? | భూమిపై ఉన్న మొత్తం నీటిలో సముద్రాలు, మహాసముద్రాలు, భూగర్భ జలాలలో ఉన్న నీటిలో 97 శాతం ఉప్పు నీరే. 2.5-2.75% మాత్రమే మంచినీరు. దీనిలో 1.75-2% (మూడింట రెండు వంతులు) నీరు గ్లేషియర్లు, మంచు, హిమపాతం రూపంలో గడ్డకట్టి ఉంటుంది. 0.7-0.8% మంచినీరు భూగర్భజలంగా, నేలలో నీటి ఆవిరి రూపంలో ఉంటుంది. 0.01%’ కంటే తక్కువ పరిమాణంలో మంచినీర... | |
ద్రవ్యోల్బణాన్ని నిర్వచించి, కారణాలను వివరించండి. | సాధారణ ధరల స్థాయిలో స్థిరమైన, గ్రహించదగిన పెరుగుదల పరిస్థితిని ద్రవ్యోల్బణం అంటారు. ఇది అనేక విధాలుగా ప్రజల ఆర్థిక జీవితాన్ని, సంక్షేమాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఉత్పత్తి విలువ, పంపిణీ విలువ ప్రభావితం కలిగి ఉంటుంది.
ద్రవ్యోల్బణానికి కారణాలు: ద్రవ్యోల్బణం అధిక డిమాండు వల్లగాని, అల్ప సప్లయ్ వల్లగాని, ఉత్పత్తి వ్యయం ప... | |
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి
షాట్కీ లోపం అంటే ఏమిటి? | షాట్కీ లోపం :
1. “శుద్ధ జాలకంలో ఖాళీ ఉంటే దాన్ని షాట్కీ లోపం అంటారు. జాలకం సాధారణ స్థానం నుంచి ఒక పరమాణువు లేదా అయాన్ ను తీసివేస్తే వచ్చేది బిందులోపం.”
2. అయానిక స్ఫటికాలలో విద్యుత్ ఆవేశాల తటస్థ స్థితిని నిలబెట్టాలి. అందుకోసం ఒక కాటయాన్ అయాన్ వల్ల ఖాళీ ఏర్పడితే దానితోపాటు ఆ అయాన్కు విరుద్ధ ఆవేశంగల ఆనయాన్ అయాన్ కూడా తన... | |
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి
ఏ విధంగా గాజు క్వార్ట్జ్ నుంచి విభిన్నంగా ఉంటుంది? | గాజు ఒక అస్ఫాటిక ఘన పదార్థం. ఇందులో కణాల అమరిక లఘు విస్తృతి క్రమంలో ఉంటుంది.
క్వార్ట్జ్ ఒక స్ఫటిక ఘన పదార్థం. ఇందులో కణాల అమరిక దీర్ఘ విస్తృతి క్రమంలో ఉంటుంది.
| |
సత్యవాక్కువలన కలిగే ప్రయోజనాలు ఏవి? | సత్యం మాట్లాడడం వలన కీర్తి పెరుగుతుంది. సత్యం మాట్లాడడం వలన జన్మ వలన వచ్చిన అజ్ఞానం నశిస్తుంది. సత్యం వలన మన స్వభావం స్థిరంగా ఉంటుంది. అందుచేత సత్యవాక్కుతో సమానమైన వ్రతం లేదు. | |
ఇచ్చిన పద్యానికి భావం రాయండి:
చ. బలయుతుఁడైన వేళ నిజబంధుఁడు తోడ్పడుఁగాని యాతఁడే
బలము తొలంగెనేని తన పాలిటి శత్రువదెట్లు పూర్ణుఁడై
జ్వలనుఁదు కానఁగాల్చు తఱి సఖ్యముఁ జూవును వాయుదేవుఁదా
బలియుఁడు సూక్ష్మదీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా! | అగ్నిహోత్రుడు నిండు బలము కలవాడై అడవిని కాల్చే సమయంలో వాయుదేవుడు అతినికి స్నేహం చూపుచూ తోడ్పడును. ఆ అగ్నిచిన్నదీపమై ఉన్న సమయంలో ఆ వాయుదేవుడే విరోధియై ఆర్పును. అదే విధంగా మానవుడు శక్తివంతుడై ఉన్న సమయంలో తన బంధువులే తోడ్పడును. బలము లేనపుడు ఆ చుట్టమే తనకు పగవాడై కీడు చేయును. | |
‘స్త్రీ విద్యా ప్రాముఖ్యతను తెలియజేస్తూ మీ సొంతంగా ఐదు నినాదాలు రాయండి. | ఇల్లాలి చదువు – ఇంటికి వెలుగు
స్త్రీవిద్యను ప్రోత్సహించు – ప్రగతిబాట పయనించు
మహిళలు చదవాలి – స్వావలంబన సాధించాలి
మహిళా చైతన్యం – సాధికారితకు సాకారం
ఇల్లంతా చదివినట్లే – ఇల్లంతా చదివితే | |
ఆవృత బీజ పుష్పంలోని ఏయే భాగాలలో పురుష, స్త్రీ సంయోగ బీజదాలు అభివృద్ధి జరుగుతుంది? వాటి పేర్లను తెలపండి. | పురుష సంయోగ బీజదము – పరాగకోశంను, స్త్రీ సంయోగ బీజదము అండంలోను అభివృద్ధి చెందుతాయి. సూక్ష్మ సిద్ధబీజం పురుష సంయోగబీజంగాను, స్థూలసిద్ధబీజం స్త్రీ సంయోగబీజదంగాను మారుతాయి. | |
ఇచ్చిన సమాచారం పరిగణించి శాస్త్రవేత్తని కనిపెట్టండి
రోగి హృదయ స్పందన వినడానికి మొదటిసారి కాగితపు గొట్టాన్ని ఉపయోగించాడు. కాగితపు గొట్టం స్థానంలో వెదురు గొట్టాన్ని వాడేవారు. దానికి స్టెతస్కోప్ అని పేరు పెట్టారు. | రెని లెన్నేక్ | |
కింది గద్యాన్ని చదివి ఖాళీలను పూరించండి.
మాటలను ఉచ్చరించునపుడు కొన్నింటిని తేల్చి పలుకుటయు, కొన్నింటిని ఒత్తి పలుకుటయు, కొన్నింటిని మధ్యస్థముగా పలుకుటయు అనుభవ సిద్ధమగు విషయమే. ఈ విధముగా ఆరోహణా వరోహణాది క్రమములో పలుకుటను ‘స్వరము’ అని యందురు. ఉచ్చారణ సమయమున కంఠము నందలి నాదతంత్రులు ప్రకంపించునట్టి వేగమును బట్టి ఈ స్వరము ... | ఖాళీలు
1. స్వరమంటే ……………………
జవాబు:
ఆరోహణ అవరోహణాది క్రమములో పలుకుట.
2. ఉచ్చారణ సమయంలో ప్రకంపించేవి ………………………
జవాబు:
కంఠమునందలి నాదతంత్రులు.
3. స్వరము కలగడానికి కారణం …………………..
జవాబు:
ప్రకంపన వేగము.
4. ఊనిక కలగడానికి కారణం …………………
జవాబు:
నాదతంత్రులు సాగిన దూరం వలన.
5. ఉచ్చారణలో మార్పులు కలగడానికి కారణం ………………….
జవాబ... | |
డాక్టర్/నర్స్ / ఆరోగ్య కార్యకర్తలు అస్వస్థతతో ఉన్న రోగులతో ఎక్కువగా గడుపుతుంటారు. అయినా వారు అస్వస్థతకు ” గురికారు ఎందుకు ? ఆలోచించి రాయండి.
| డాక్టర్ / నర్స్ / ఆరోగ్య కార్యకర్తలు అస్వస్థతతో ఉన్న రోగులతో ఎక్కువగా గడుపుతుంటారు. అయినా అస్వస్థతకు గురికారు. ఎందుకంటే వారు ఆరోగ్య నియమాలు చక్కగా పాటిస్తారు. దీనివలన వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. | |
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి
వికృతి నిర్వచించి, వికృతిలో రకాలను వివరించండి. | వికృతి :
వస్తువు యొక్క మితులలో వచ్చిన మార్పుకు వస్తువు తొలి మితులకు గల నిష్పత్తినే వికృతి అంటారు.
1. అనుదైర్ఘ్య వికృతి :
వస్తువుపై బాహ్యబలం పనిచేసినపుడు, పొడవులో మార్పునకు తొలిపొడవుకు గల నిష్పత్తిని అనుదైర్ఘ్య వికృతి అంటారు.
2. ఘనపరిమాణ వికృతి (లేదా) స్థూల వికృతి :
వస్తువుపై బాహ్యబలం పనిచేసినపుడు ఘనపరిమాణంలో మార్పుకు... | |
క్రింద ఇచ్చిన వ్యాసం దేని గురించి ప్రస్తావిస్తుంది:
సనాతనమైన భారతీయ సంస్కృతిలో సాహిత్య సంపదకు సమాన్నతమైన స్థానం ఉంది. మన సంస్కృతిలో కావ్య సంపద ఉన్నతమైంది. మన తెలుగు సాహిత్యంలో ఎన్నో వర్ణనాత్మక కావ్యాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన పాఠ్యాంశాలు కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఉన్నాయి. వర్ణనాత్మక పాఠ్యాంశాలను చదవడం వల్ల విద్యార్థు... | ఇచ్చిన వ్యాసం ప్రాచీన వర్ణనాత్మక పాఠంను చదవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు గురించి ప్రస్తావిస్తుంది | |
ఇచ్చిన గద్యానికి కొనసాగింపుగా ఒక పేరా రాయండి:
సురవరం ప్రతాపరెడ్డి సంపన్న కుటుంబీకులు. బి.ఏ. బి.ఎల్ పట్టభద్రులు. న్యాయవాద వృత్తి చేపట్టడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికి, ప్రభుత్వ ఉద్యోగం కూడా చేయక, జీవితాంతం తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన త్యాగమూర్తి సురవరం. ఈయన బహుభాషావేత్త, అనేక గ్రంథాలు రాశారు. ఉత్తమశ్రేణి పరిశోధకు... | రామాయణ రహస్యాలు, హిందువుల పండుగలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర మొదలైన గొప్ప పరిశోధనాత్మకమైన గ్రంథాలను రాశారు. వారు కవులు, కథకులు, విమర్శకులు, వ్యాసకర్తలు, బహుముఖ ప్రతిభాసంపన్నులు. వారు రాసిన నిరీక్షణము వంటి కథలు కథానికా వాఙ్మయంలో మొదటి శ్రేణికి చెందిన కథలు. | |
రక్తంలోని వ్యర్థ పదార్థాలను ఏ విధంగా గుర్తిస్తారు? | మూత్ర పరీక్ష ద్వారా | |
తెలుగు భాషలో మీకు తెలిసిన కవుల పేర్లు రాయండి. | నన్నయభట్టు తెలుగులో ఆదికవి. తిక్కన, ఎఱ్ఱ ప్రగడ, శ్రీనాథుడు, పోతన, అనంతామాత్యుడు, బాలగంగాధర్ తిలక్, గురజాడ, రాయప్రోలు సుబ్బారావు, శ్రీశ్రీ, దాశరథి, జాషువ – నారాయణరెడ్డి వంటి తెలుగుకవుల పేర్లు నాకు తెలుసు. | |
యమకాలంకారం గురించి వివరించి ఉదాహరణలు ఇవ్వండి. | యమకాలంకారం :
లక్షణం :
అచ్చులలో హల్లులో మార్పులేనట్టి అక్షరాల సమూహం అర్థభేదంతో మరల మరల ప్రయోగింపబడితే దాన్ని ‘యమకాలంకారం’ అని అంటారు.
ఉదాహరణ 1 :
పురము నందు నందిపురమునందు.
సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో ‘పురము’ అనే అక్షర సమూహం అర్థభేదంతో మరల మరల ప్రయోగింపబడింది. అందువల్ల దీనిని ‘యమకాలంకారం’ అని అంటారు.
ఉదాహరణ 2 :
లేమా !... | |
C = {1, 2, 3, 5} అయిన n (C) విలువ ఎంత ? | n(C) = 4 | |
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి
కేంద్రక రియాక్టర్ నియంత్రణ కడ్డీల పాత్ర ఏమిటి? | నియంత్రణ కడ్డీలు :
కేంద్రక రియాక్టర్లో న్యూట్రాన్లను శోషించడానికి వాడే కడ్డీలను నియంత్రణ కడ్డీలు అంటారు. నియంత్రణ కడ్డీలకు వాడే పదార్థాలు కాడ్మియం, బెరీలియం, బోరాన్.
రియాక్టర్ నియంత్రణ కడ్డీలను బయటకు లాగితే, పనిచేస్తుంది. లోపలికి నెట్టితే, రియాక్టర్ ఆగిపోతుంది. | |
పాఠశాలలకు విద్యార్థుల్ని పరీక్షచేయుటకు ‘పిల్లల డాక్టరు’ వచ్చారు. వారిని ఎలా ఇంటర్వ్యూ చేస్తారో వివరించండి. | నమస్కారం డాక్టరు గారూ !
నాతోటి బాలబాలికల్ని ఎప్పుడెప్పుడు వచ్చి పరీక్షిస్తారు ?
సర్వ సాధారణంగా విద్యార్థుల్లో వచ్చే వ్యాధులేమిటి ? వాటికి నివారణోపాయాలేమిటి ?
కొన్ని కొన్ని సందర్భాల్లో విద్యార్థుల్లో ‘డిస్లెక్సియా’ వ్యాధి వస్తూంటుంది అని నేను విన్నాను. దాని లక్షణాలేంటి ? ఆ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలి ?
పేద విద్యార్థులకు మం... | |
ఇచ్చిన సమాచారం పరిగణించి శాస్త్రవేత్తని కనిపెట్టండి
ఇతనొక బ్రిటీష్ వైద్యుడు. గుండెలో ఒకే దిశలో రక్త ప్రసరణకు తోడ్పడే కవాటాలను గుర్తించాడు. ఇవి రక్తాన్ని కర్ణికల నుండి జఠరికలకు ప్రవహింపజేస్తాయి అని కనుగొన్నాడు. | విలియం హార్వే | |
ఇచ్చిన పద్యానికి ప్రతిపదార్ధాలు మరియు తాత్పర్యం రాయండి:
చ. విమలయశోనిధీ ! పురుషవృత్త మెఱుంగుచునుండుఁ జూవె వే
దములును బంచభూతములు ధర్మువు సంధ్యలు సంతరాత్మయున్
యముఁడును జంద్రసూర్యులు సహంబును రాత్రియు నన్మహాపదా
ప్రములివి యుండంగా నరుఁడు దక్కొన నేర్చునే తన్ను మ్రుచ్చిలన్. | ప్రతిపదార్థం :
విమల యశోనిధీ ! = నిర్మలమైన కీర్తికి నెలవైన ఓ రాజా !
వేదములను = ఋక్, యజుర్, అధర్వణ, సామ – అనే నాలుగు వేదాలూ
పంచభూతములు = నేల, నింగి, నీరు, నిప్పు, గాలి – అనే అయిదు భూతాలూ
ధర్మువు = ‘ధర్మమూ
సంధ్యలు = ఉదయసంధ్య, సాయంసంధ్య అనే రెండు సంధ్యలూ
అంతః + ఆత్మయున్ = మనస్సూ
యముఁడును = మృత్యుదేవత అయిన యముడూ
చంద్రసూర్యు... | |
ప్రపంచీకరణ దేశాలను అనుసంధానం చేయటం వల్ల ఉత్పత్తిదారుల మధ్య పోటీని పెంచుతుంది. సమర్థించుము. | ప్రపంచీకరణ దేశాలను అనుసంధానం చేయటం వల్ల ఉత్పత్తిదారుల మధ్య పోటీని పెంచుతుందనుటలో సందేహం లేదు.
సాధారణంగా బహుళజాతి సంస్థలే వివిధ దేశాలలో ఉత్పత్తి, వాణిజ్యం చేస్తున్నాయి.
వివిధ దేశాల మార్కెట్ ను కైవసం చేసుకోవటానికి MNC లు కచ్చితంగా పోటీపడతాయి.
MNC లు భారీ పరిశ్రమల ద్వారా ఉత్పత్తి చేస్తాయి. సాధారణంగా నాణ్యత ప్రమాణాలు పాటి... | |
ఈ క్రింది వానిలో సత్యమేది ?
(A) ఒక బహుపది యందు స్థిర విలువ లేకుంటే దానికి – సున్న ఒక శూన్య విలువ
(B) శూన్య విలువ వద్ద బహుపది విలువ సున్న
(C) ఒక బహుపది (p, 0) వద్ద X – అక్షాన్ని ఖండించిన దాని శూన్య విలువ ‘p’
(D) పైవన్నీ | (D) పైవన్నీ | |
పూర్వకాలంలో వేడుకలు, వినోదాలను గురించి రాయండి. | తెలుగు దేశాన పూర్వకాలంలో వేడుకలు వినోదాలు ఎలా ఉండేవో, పండుగలు పబ్బాలతో ఎలా కాలక్షేపం చేసేవారో తెలుసుకొనుటకు ఆధారాలు అంతగా దొరకవు. కాకపోతే మన ప్రబంధముల ద్వారా కొన్ని తెలుస్తున్నాయి. వాటిలో వసంతోత్సవం, శరదుత్సవం గొప్పవేడుకలుగా వివరింపబడ్డాయి. వసంతోత్సవం వేయి సంవత్సరము లకు పూర్వం నుండి ఉన్నప్పటికి రెడ్డి రాజుల కాలq నుండి ... | |
p) 1, 1/2,1/4,1/8 …………….
q) 1, 2, 4, 8, …….. అయితే
A) p-గుణ శ్రేణి, q-అంకశ్రేణి
B) p, q లు రెండూ అంకశ్రేఢులు
C) p, q లు రెండూ గుణ శ్రేఢులు
D) p-అంకశ్రేణి, q-గుణ శ్రేడి C | C) p, q లు రెండూ గుణ శ్రేఢులు |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.